Sheikh Hasina Visa: షేక్ హసీనా వీసా గడువును పొడిగించిన భారతప్రభుత్వం..! 11 h ago

featured-image

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పాస్ పోర్ట్ ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేయడంతో ఆమె వీసా గడువును పొడిగిస్తూ భారతప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదహారేళ్లుగా బంగ్లాదేశ్ ప్రధానిగా కొనసాగుతూ వచ్చిన షేక్ హసీనా ప్రభుత్వం 2024 ఆగస్టులో జరిగిన రిజర్వేషన్ల అంశంపై చెలరేగిన అల్లర్ల కారణంగా పతనమవ్వడంతో పదవీచ్యుతురాలైన ఆమె..స్వదేశాన్ని వీడి భారత్ కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆ తర్వాత స్వదేశంలో ఆమెపై అనేక కేసులు నమోదవ్వడంతో పాటు అరెస్టు వారెంట్లు కూడా జారీ అయ్యాయి. ఈ క్రమంలోనే హసీనాను తమకు అప్పగించాలంటూ గత డిసెంబరులో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత ప్రభుత్వానికి ఒక దౌత్య సందేశం పంపింది.

2024 ఆగస్టులో చెలరేగిన రిజర్వేషన్ల అల్లర్లకు కారణాలు..

1971లో బంగ్లాదేశ్ విముక్త పోరాటంలో మరణించిన వారి పిల్లలకు, మనవళ్లు, మనవరాళ్లకు 30% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. 10% స్థానిక పరిపాలన జిల్లాల వారికి, 10% మహిళలకు, 5% మైనారిటీ తెగల వారికి, 1% దివ్యాంగులకు ఇస్తున్నారు. ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి, రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. బంగ్లాదేశ్ లోని ప్రధాన నగరాలైన ఢాకా, రాజాహీ, ఖుల్నా, చత్తోగ్రాంలలో గతేడాది జులై, ఆగస్టు నెలల్లో పెద్దఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఇవి హింసాత్మకంగా మారడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో ఉద్రిక్తతలను ఆపలేక ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయారు.

మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం..

ఆ తర్వాత నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వ హయంలో బంగ్లాదేశ్లోని మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం వీటిని అరికట్టలేకపోతోంది.


Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD